హైదరాబాద్: 28°C
వార్తలు

యూట్యూబర్‌కు నేడు రెండో శస్త్రచికిత్స

అన్నమయ్య: కడప–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యూట్యూబర్ జయకృష్ణకు బుధవారం రెండో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు ఆయన తల్లి సులోచన తెలిపారు. సోమవారం తలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన వైద్యులు, నేడు కాలుకు సర్జరీ చేయనున్నారని చెప్పారు. ప్రస్తుతం జయకృష్ణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.