JGL: ధర్మారం గ్రామానికి చెందిన బోండ్ల మానసకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కింద రూ.20 వేల ఆర్థిక సహాయం మంజూరైంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారురాలికి మంజూరు పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
వార్తలు
ధర్మారం మహిళకు రూ.20 వేల ఆర్థిక సాయం


