హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ రాజీనామా చేయాలి: రాహుల్

యువతపై లాఠీఛార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. NDA ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంటులో చర్చకు కూడా సర్కార్ ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. గూండాగిరి, నిరంకుశత్వం పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. వెంటనే మోదీ మౌనం వీడాలని.. నీట్ అంశంపై సమాధానం చెప్పాలని కోరారు.