హైదరాబాద్: 28°C
వార్తలు

నర్సరీల్లో మొక్కల కొరత.. మాజీ మేయర్ అసంతృప్తి

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని డ్యామ్ నర్సరీని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మంగళవారం పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైనా ప్రజలకు పంపిణీ చేసేందుకు సరిపడా పూల, పండ్ల మొక్కలు లేకపోవడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సరీల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, వెంటనే సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.