హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదకరంగా కరెంటు తీగలు

ADB: సోనాల మండలంలోని మారుమూల ఆదివాసి గ్రామాలలో వేలాడుతున్న కరెంటు వైర్లు అందరిని భయపెడుతున్నాయి. వజ్జర్ పరిధిలోని నాగుగూడ గ్రామ శివారులో రోడ్డు వెంట కరెంటు తీగలు కిందికి వేలాడుతూ ఉన్నాయి. అటుగా వెళ్లే గ్రామస్థులు ఆదమరిస్తే ఘోర ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని నాగుగూడ గ్రామస్థులు వాపోతున్నారు. కరెంటు తీగలు బాగు చేయాలని కోరుతున్నారు.