హైదరాబాద్: 28°C
వార్తలు

యూకేలో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా లేబర్‌ పార్టీకి చెందిన నాయకుడు ఆండీ బర్న్‌హామ్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ మంత్రిగా భారత సంతతికి చెందిన కనిష్క నారాయణ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన బ్రిటన్ తొలి ఏఐ మంత్రిగా చరిత్ర సృష్టించారు. కనిష్క స్వరాష్ట్రం బీహార్ కావటం విశేషం.