వికారాబాద్ రైతు బజార్ సమీపంలోని సెయింట్ జోసెఫ్, సిద్ధార్థ, భాష్యం విద్యాసంస్థల వద్ద రోడ్డుపై మురుగునీరు పారుతోంది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
వార్తలు
వికారాబాద్ రోడ్డుపై మురుగునీరు.. స్థానికులు ఇబ్బందులు


