హైదరాబాద్: 28°C
వార్తలు

వక్ఫ్ బోర్డుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

కేరళం రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ వక్ఫ్ బోర్డు ఎటువంటి కీలక విధానపరమైన నిర్ణయాలు, క్యాపిటల్ వ్యయం చేయకూడదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. వక్ఫ్ బోర్డు రోజువారీ, ప్రాథమిక విధులను అడ్డుకునేలా ఆంక్షలు అవసరం లేదని వెల్లడించింది. అలాగే బోర్డు కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే సాగాలంటూ ఇచ్చిన నిబంధనను రద్దు చేసింది.