హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే

W.G: నరసాపురం రుస్తుంబాద ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన జరుగుతున్న మున్సిపల్ డ్రైన్ డీ-సిల్టింగ్ పనులను ఎమ్మెల్యే నాయకర్ పరిశీలించారు. బల్లకట్టు సెంటర్ వద్ద పనులను తనిఖీ చేసి, మురుగునీటి పారుదల సజావుగా జరిగేలా అవసరమైన చోట తూములు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగునీరు, మంచినీరు కలవకుండా సైఫన్ అక్వెడక్ట్‌కు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.