మాస్కో దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయ తాత్కాలిక ప్రతినిధి లాడనోవ్‌కు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఈ దాడిపై భారత్ తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాకుండా పౌర వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని మరోసారి హెచ్చరించింది.
వార్తలు
రష్యా రాయబారికి భారత్ సమన్లు


