హైదరాబాద్: 28°C
వార్తలు

దేవుని పాపం కూటమికి తగులుతుంది: బొత్స

AP: పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను తక్షణం ఆపాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రేపు ఉదయానికల్లా మైనింగ్ వాహనాలు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లకుంటే రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు. పంచదార్ల కొండల కోసం ధర్మపోరాటం చేస్తున్నామని.. మా పోరాటంలో ఏం కుట్ర ఉందో కూటమి నేతలు చెప్పాలని ప్రశ్నించారు. దేవుని పాపం కూటమి నేతలకు తగులుతుందని వ్యాఖ్యానించారు.