హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి: షేక్ షకీల్

ADB: అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి భీమ్ ఆర్మీ పార్టీ పనిచేస్తుందని జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భీమ్ ఆర్మీ ఆవిర్భావ వేడుకలను మంగళవారం నిర్వహించారు. షకీల్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని కోరారు.