హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మురుగునీటితో ప్రజల అవస్థలు

బాపట్ల బ్రాహ్మణ బజార్‌లో రహదారి కుంగిపోవడంతో డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలుస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతుండగా పలువురు జారి గాయపడినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు తాత్కాలికంగా నీటిని తొలగిస్తున్నా సమస్య మళ్లీ వస్తోందని వాపోయారు. రహదారిని వెంటనే బాగుచేసి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.