హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఉభయసభలు మరోసారి వాయిదా

పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోసారి విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్, అవకతవకలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభలను వాయిదా వేశారు.