హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంఛార్జ్‌గా ఎంపీఓగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ

KMM: ముదిగొండ మండల పరిషత్ అభివృద్ధి ఇంచార్జ్ అధికారిగా రామకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని ఇంఛార్జ్ MPO అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న అర్హులందరికీ అందేలా అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానన్నారు.