హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా నిరసన

AKP: వైసిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, కే కోటపాడు జడ్పిటిసి అనురాధ పాల్గొన్నారు.