హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నమండెంలో మంత్రి ప్రజా దర్బార్..!

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వ్యక్తిగత, గ్రామాభివృద్ధి సంబంధిత వినతులు స్వీకరించి,సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.