హైదరాబాద్: 28°C
వార్తలు

భీమలింగేశ్వర ఆలయం వద్ద కోళ్ల వ్యర్థాలు.. భక్తులకు ఈగలతో తీవ్ర ఇబ్బందులు

AKP: బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట–పి.భీమవరం గ్రామాల సరిహద్దులోని భీమలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో కోళ్ల ఫారాల వ్యర్థాలు, చనిపోయిన కోళ్లను పారవేయడంతో దుర్వాసన, ఈగల సమస్య ఏర్పడింది. దీని వలన ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలను వెంటనే తొలగించి, ఫారాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.