హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో కొనసాగుతున్న సీజేపీ ఆందోళన

ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతోంది. నిన్న పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులు నిరసన చేపట్టారు. మరోవైపు జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై దాడిని పార్లమెంట్‌లో విపక్షాలు ఖండించాయి. పార్లమెంట్ ఆవరణలో ఆప్ ఎంపీలు సైతం ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.