హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కమిషనర్

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలతో కలిసి అల్పాహారం స్వీకరించి ఆహార నాణ్యత, మెనూ అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన వసతిపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు కమిషనర్ తెలిపారు.