హైదరాబాద్: 28°C
వార్తలు

పోచారంలో అలరించనున్న సఫారీ యాత్ర

MDK: హవేలిఘనపూర్ మండల పరిధిలోని పోచారం అభయారణ్యంలో పర్యాటక అనుభూతిని మరింత పెంచేందుకు అటవీ శాఖ నూతన సఫారీ వాహనాన్ని ప్రారంభించింది. ఒకేసారి 10 మంది పర్యాటకులు ప్రయాణించేలా రూపొందించిన ఈ వాహనం ద్వారా అడవిలోని వన్యప్రాణులను క్లోజప్‌లో వీక్షించే సౌకర్యం కలగనుంది. సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.