లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. దీంతో ప్రారంభమైన కాసేపటికే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. అంతకుముందు విపక్ష నేతలు ఓంబిర్లాను కలిశారు. విద్యార్థుల ఆందోళనపై చర్చకు డిమాండ్ చేశారు. సభలో విద్యార్థుల అంశం చర్చించాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభ వాయిదా


