హైదరాబాద్: 28°C
వార్తలు

సీపీఐలో ముగ్గురు సస్పెండ్

ATP: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణ ఉల్లంఘన ఆరోపణలతో ముగ్గురిని సీపీఐ సస్పెండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ. కుళ్లాయిస్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జాన్సన్ బాబు, జిల్లా ఆటో డ్రైవర్ల సంఘం కార్యదర్శి ఎస్. రమణయ్యను సీపీఐ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు.