హైదరాబాద్: 28°C
వార్తలు

తుంగభద్ర డ్యామ్‌కు తగ్గిన వరద

ATP: జిల్లాకు జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం డ్యాంలో 25.77 టీఎంసీల నీరుంది. కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల పరిధిలో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు పంటలు విత్తుకుని నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా ప్రవాహం తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 79.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది.