KKD: రాయపురంలో రెండు రోజులుగా పంట పొలాలు నీట మునిగి ఉన్నాయి. గ్రామంలోని తూటేరు కాలువలో గుర్రపుడెక్క పేరుకుపోవడం, వేట్లపాలెం నుంచి నీరు పెద్దఎత్తున దిగువకు రావడంతో సుమారు 300 ఎకరాలు ముంపుతో చెరువులా మారాయి. పొలాల్లో వరినాట్లు పూర్తికావ డంతో నీటి నిల్వతో నారు పాడైపోయి తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏవో మురళీధరను అడగ్గా సమస్యను కలెక్ట రకు వివరిస్తామన్నారు.
వార్తలు
అరెరే.. కమతం కాసారమాయె..!


