హైదరాబాద్: 28°C
వార్తలు

బొబ్బిలి ప్రవేశ ద్వారం వద్ద బొగ్గు లారీ ప్రమాదం

VZM: రాయపూర్ నుంచి విశాఖపట్నానికి బొగ్గు తరలిస్తున్న లారీ బొబ్బిలి ప్రవేశ ద్వారం వద్ద అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో లారీ ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.ఈ  ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.