SRD: మునిపల్లి మండలం మక్తక్యాసారం గ్రామానికి చెందిన భాగ్యకు పురిటినొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో EMT జుబేర్ సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే సుఖ ప్రసవం చేయించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
వార్తలు
అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం


