హైదరాబాద్: 28°C
వార్తలు

కొండాపూర్లో వర్షం.. పంటలకు ఊరట

SRD: కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిన్నటి నుంచి ఇప్పటికీ వరకు ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. ఎండిపోతున్న పత్తి, పెసర, మినుము, సోయా పంటలకు ఈ వర్షం ఊరటనిచ్చిందని రైతులు తెలిపారు. పొలాల్లో తేమ పెరగడంతో పంటలు కోలుకునే అవకాశం ఉందని, సాగు పనులు వేగం పుంజుకుంటాయని మండలంలోని పలు గ్రామాల రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.