హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ సిలిండర్ దొంగతనం.. నిందితుడు అరెస్ట్: CI

ADB: మద్యం కోసం గ్యాస్ సిలిండర్ చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. బంగారిగూడకు చెందిన షేక్ గని ఈ నెల 18న తిర్పల్లిలోని గ్యాస్ గోదాం ట్రాలీ నుంచి సిలిండర్‌ను దొంగలించినట్లు పేర్కొన్నారు. జూలై 20న మసూద్ చౌక్‌లో దానిని విక్రయించేందుకు యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు CI వెల్లడించారు.