హైదరాబాద్: 28°C
వార్తలు

గొర్రెల మందపై గుర్తు తెలియని జంతువు దాడి

ATP: శింగనమల సమీపంలోని కొండ కింద గుర్తుతెలియని జంతువు దాడి చేయడంతో 20 గొర్రె పిల్లలు, గొర్రె మృతి చెందాయి. రైతు నాగరాజు చెందిన గొర్రెల మందను మేత కోసం కొండ కిందకు తీసుకెళ్లారు. గొర్రె పిల్లల వద్దకు రైతు వచ్చి చూడగా 20 గొర్రె పిల్లలు, గొర్రె మృతిచెంది ఉండడం గమనించారు. రూ. 60 వేల నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు వాపోయారు. తమకు ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.