మహబూబాబాద్ మండలంలోని బేతుల్–పర్వతగిరి రహదారిలో నిర్మాణంలో ఉన్న నల్లకుంట బ్రిడ్జిని ఎమ్మెల్యే మురళీ నాయక్ సందర్శించి పనులను సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను ఆరా తీసి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం రహదారి నిర్మాణ పనులను పరిశీలిస్తామని తెలిపారు.
వార్తలు
నల్లకుంట బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


