హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకన్న అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్ కు మంగళవారం శ్రీకాకుళం వాస్తవ్యులు చిన్నం బాల శంకర్ రెడ్డి, లలిత వారి కుటుంబ సభ్యులు  రూ.1,00,007 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.