NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. ఉదయం నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, సహస్రనామార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.
వార్తలు
చౌడేశ్వరి దేవి అమ్మవారికి పూజలు


