హైదరాబాద్: 28°C
వార్తలు

గోకవరంలో బైక్, కారు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

E.G: గోకవరం ఊరు చివర పెట్రోల్ బంక్ ఎదురుగా సోమవారం రాత్రి బైక్, కారు బలంగా ఢీకొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనాన్ని పిలిపించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు.