గద్వాల కేంద్రంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై గుంతలు కనిపించక ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: వర్షంతో గద్వాల రహదారులు జలమయం


