NRPT: ఊట్కూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నేడు గ్రామసభ నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పన్నుల వసూళ్లు, మౌలిక వసతుల అభివృద్ధిపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.
వార్తలు
నేడు ఊట్కూర్‌లో గ్రామసభ నిర్వహణ


