AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో రెండు వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండనున్నారు. కుడి భుజం సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకోవాలని, జనం మధ్యకు వెళ్తే గాయం తిరగబెట్టే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. దీంతో ఆయన పిఠాపురం, రాజమహేంద్రవరం పర్యటనలు వాయిదా వేసుకున్నారు. మంగళగిరి క్యాంపు ఆఫీస్ నుంచే అధికారిక విధులు నిర్వహించనున్నారు.
వార్తలు
క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ దూరం


