TG: రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ప్రభుత్వంలో విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదలైందని, అనంతరం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. కార్మికుల సంక్షేమానికి, పీఆర్సీ అమలు, అలవెన్సుల సాధనకు తమ యూనియన్ అండగా ఉంటుందన్నారు.
వార్తలు
'కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం'


