హైదరాబాద్: 28°C
వార్తలు

నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం: మంత్రి వివేక్

TG: ఎల్‌నినో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో వల్ల వచ్చే లోటు వర్షపాతం, నీటి కొరత, పంట నష్టాలను ముందే అంచనా వేయాలన్నారు. నష్టాన్ని తగ్గించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.