హైదరాబాద్: 28°C
వార్తలు

రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయులు మృతి చెందారు. ఒడెసా పోర్టులో నుంచి బయలుదేరిన కార్గో నౌకలపై మాస్కో క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.