హైదరాబాద్: 28°C
వార్తలు

'2028 ఆగస్టు నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పూర్తి'

NLG: 2028 ఆగస్టు నాటికి శ్రీశైలం సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఎల్ నినో ప్రభావం పరిస్థితులను ఎదుర్కొనేందుకు జరిపిన సమీక్షలో మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు.