హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచి 'ఫ్యూచర్-రెడీ AP పోలీస్ రిట్రీట్-2026'

AP: రేపటి నుంచి 2 రోజుల పాటు విజయవాడలో 'ఫ్యూచర్-రెడీ AP పోలీస్ రిట్రీట్-2026' నిర్వహిస్తామని DGP హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. భవిష్యత్ నేరాలపై కార్యాచరణకు AP పోలీసులను సిద్ధం చేయడంతో పాటు పెరుగుతున్న సైబర్ నేరాలు, AI టెక్నాలజీపై చర్చిస్తామని చెప్పారు. అలాగే APలో మహిళలు, చిన్నారుల భద్రత, డ్రోన్ ముప్పు, ఉగ్రవాద నిరోధంపై సమీక్షలు, వ్యూహాల రూపకల్పన చేస్తామని DGP వెల్లడించారు.