హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ క్రీడల మహాసంగ్రామానికి గచ్చిబౌలి వేదిక

HYD: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జూలై 23 నుంచి 30 వరకు 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్‌షిప్-2026 జరగనుంది. సీఐఎస్‌ఎఫ్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన 1,600 మందికి పైగా క్రీడాకారులు జూడో, వుషు, టేక్వాండో, కరాటే, పెంచక్ సిలాట్ విభాగాల్లో పోటీపడనున్నారు.