హైదరాబాద్: 28°C
వార్తలు

అత్యంత 'యువ వ్యతిరేక' ప్రధాని మోదీనే: రాహుల్

ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశ చరిత్రలోనే యువతను ఇంతలా చిన్నచూపు చూసిన ప్రధాని మరొకరు లేరని ధ్వజమెత్తారు. మోదీనే అత్యంత యువ వ్యతిరేక ప్రధాని అని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థపై, పరీక్షలపై తమకు జరుగుతున్న అన్యాయం గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగేందుకు వచ్చిన విద్యార్థులపై లాఠీలు ఝుళిపించడం, అదుపులోకి తీసుకోవడం దారుణమని దుయ్యబట్టారు.