హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నారిపై దారుణం.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం

గుజరాత్ ఆనంద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, కిరాతకంగా హతమార్చిన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు యత్నించాడని అధికారులు తెలిపారు. అంతేకాకుండా కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు. గాయాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు.