హైదరాబాద్: 28°C
వార్తలు

'కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలి'

BPT: బాపట్ల పట్టణం మూడో వార్డు రెల్లి కాలనీలో అధిక లోడ్‌తో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను మార్చి, కొత్తది ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా రాత్రివేళల్లో తరచూ కరెంట్ పోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రమాదాలు జరగకముందే స్పందించాలన్నారు.