హైదరాబాద్: 28°C
వార్తలు

' చెస్‌తో ఏకాగ్రత, మానసిక వికాసం'

KNR: అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ భగత్‌నగర్‌లోని విశ్వనాథ్ చెస్ అకాడమీలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్‌రావు పాల్గొని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారితో చెస్ ఆడి ఉత్సాహపరిచారు. చెస్ ఆటతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక వికాసం పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గణేష్, కోచ్‌లు పాల్గొన్నారు.