హైదరాబాద్: 28°C
వార్తలు

అనంతపురంలో టీడీపీ కార్యాలయానికి స్థల పరిశీలన

ATP: అనంతపురం నగరంలోని ఆయిల్ ఫెడ్ స్థలంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి అధికారులు ఫీల్డ్ సర్వే నిర్వహించారు. ఈ స్థలాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి సందర్శించారు. పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను పూల నాగరాజు ఆదేశించారు.