హైదరాబాద్: 28°C
వార్తలు

పుంగనూరు ఎమ్మెల్యేతో బీసీ నాయకుడి భేటీ

CTR: సోమల మండలం నెల్లిమంద గ్రామపంచాయతీకి చెందిన రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకటరమణ, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, వారి సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.