హైదరాబాద్: 28°C
వార్తలు

విత్తన బంతులతో సామాజిక వనాలు

VSP: విద్యార్థులు తయారు చేసిన విత్తన బంతులు మొలకెత్తడం అభినందనీయమని వీఎంఆర్‌డీఏ ఎఫ్‌ఆర్‌‌వో పి. శిరీష అన్నారు. ఎస్.ఆర్.కే. ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాలలో ‘గ్రీన్ క్లైమేట్ టీమ్’ ఎన్జీవో ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి వంద విత్తన బంతులు తయారు చేసి నాటడం ద్వారా సామాజిక వనాలను పెంచి, పర్యావరణాన్ని కాపాడాలన్నారు.